మంచి ఆరోగ్యం మరియు ఆనందం పొందడానికి మంచి నిద్ర చాలా అవసరం. ఫిజికల్ ఆక్టివిటీ, స్లీప్ ఎన్విరాన్మెంట్, స్ట్రెస్ లెవెల్స్ మంచి  నిద్ర పొందడానికి ముఖ్యమైన అంశాలు అయినప్పటికీ మంచి ఆహారం కూడా చాలా ముఖ్యం. ఈ ఆర్టికల్ లో మనం ఆరోగ్యంగా ఉండడానికి  మంచి నిద్ర ఎలా సహాయపడుతుంది మరియు మంచి నిద్ర పొందడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.

మంచి నిద్ర వల్ల వచ్చే ఉపయోగాలు

మంచి నిద్ర మన ఆరోగ్యానికి చాలా అవసరం. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, దీర్ఘకాల ఆరోగ్యం కోసం మంచి ఆరోగ్యకరమైన నిద్ర చాలా అవసరం. ఆరోగ్యకరమైన నిద్ర వల్లే వచ్చే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం.

  1. శారీరక ఆరోగ్యం: ఆరోగ్యకరమైన నిద్ర వల్ల మీ శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీ శరీరం యొక్క ఇమ్యూనిటీ పెరిగి మిమ్మల్ని వివిధ రోగాల నుండి కాపాడుతుంది. అలాగే మీ కండరాల ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది మరియు మీ శరీరానికి రిలాక్సేషన్ ను అందిస్తుంది. మంచి నిద్ర  మీ గుండె రోగాలను మరియు రక్తపోటు సమస్యలను దూరం చేయడానికి సహాయపడుతుంది. అలాగే గాయం అయినప్పుడు, మంచి నిద్ర ఉండడం వలన మీరు త్వరగా కోలుకుంటారు.
  2. మానసిక ఆరోగ్యం: ఆరోగ్యకరమైన నిద్ర వలన మీ మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ మూడ్ ని మెరుగుపరుస్తుంది.  స్లీప్ డిసార్డర్స్, డిప్రెషన్ మరియు ఆంక్సయిటీ ని దూరం చేస్తుంది. అలాగే మీ మానసిక ఒత్తిడిని దూరం చేసి మీకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.
  3. హార్మోనల్ బాలన్స్: ఆరోగ్యకరమైన నిద్ర మీ హార్మోన్ల ఇంబ్యాలెన్సు ను దూరం చేస్తుంది. మీ శరీరం యొక్క మెటబాలిజం ను కూడా పెంచుతుంది.
  4. దీర్ఘకాల ఆరోగ్యం: ఆరోగ్యకరమైన నిద్ర డైయాబెటిస్, గుండె రోగాలు, న్యూరోలాజికల్ వ్యాధుల వంటి దీర్ఘకాల వ్యాధులను మీ నుండి దూరం చేస్తుంది. ఆరోగ్యమైన నిద్ర మీ జీవిత కాలాన్ని పెంచడానికి మరియు మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

ఆరోగ్యకరమైన నిద్ర మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు మీ రోజువారీ పనులని సమర్థవంతంగా చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితం మెరుగ్గా ఉండడానికి సహాయపడుతుంది.

మంచి నిద్రను ప్రోత్సహించే ఆహారాలు

కొన్ని ఆహారాలలో నిద్రను మెరుగు పరిచే పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు రిలాక్సేషన్ ను ప్రోత్సహించి , స్లీప్ హార్మోన్లను మెరుగుపరచి స్లీప్ క్వాలిటీ ని మెరుగుపరుస్తాయి. ఇప్పుడు మనం కొన్ని నిద్రను మెరుగుపరిచే ఆహారాల గురించి తెలుసుకుందాం.

  1. పాలు: మనకి మామూలుగా నిద్ర పోవడానికి అనుకూలంగా ఉండే ఆహారం ఏంటి అనగానే గుర్తొచ్చేది పాలు. పాలల్లో కాల్షియమ్, విటమిన్ D మరియు మెలటోనిన్ వంటి పోషకాలు ఉండడం వలన , మీకు నాణ్యమైన నిద్ర అందుతుంది. పాలు మాత్రమే కాదు జున్ను, పెరుగు వంటి ఇతర పాల పదార్థాలు తీసుకోవడం వలన కూడా మీకు మంచి నిద్ర అందుతుంది.
  2. ఆక్రోట్: ఆక్రోట్ లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్  ఉంటాయి మరియు దీని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది మరియు ఇవి తిన్నప్పుడు మీ శరీరం యొక్క ఇన్సులిన్ మరియు బ్లడ్ షుగర్ ను పెరుగుతుంది. అక్రోట్లలో మెలటోనిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. పడుకునే ముందు వీటిని తినడం వలన మీకు మంచి నిద్ర అందుతుంది.
  3. అరటి పండు: అరటి పండు లో మెగ్నీషియం మరియు పొటాషియం ఉంటాయి.  ఇవి మీ మజిల్స్ ను రిలాక్స్ చేసి మంచి నిద్రను అందిస్తాయి. సాయంత్రం పూట ఒక్క అరటి పండు తినడం వలన మీకు మంచి నిద్ర అందుతుంది.
  4. కివి పండు: కివి తినడం వలన మీకు మంచి నాణ్యమైన నిద్ర అందుతుంది. కివి లో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్  C ఉంటుంది. ఇవి మీ నిద్రను మెరుగుపరుస్తాయి. కివి పండు రుచికరమైనవే కాదు ఆరోగ్యకరమైనవి కూడా.
  5. అన్నం: తెల్ల అన్నం లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తినడం వలన  మీ ఇన్సులిన్ లెవెల్స్ మరియు బ్లడ్ షుగర్ తొందరగా పెరుగుతుంది మరియు మీ ఆకలి తీరుతుంది. ఇది మీ నిద్ర క్వాలిటీ ని పెంచుతుంది.
  6. ఓట్స్: అన్నం లాగానే ఓట్స్ లో కూడా కార్బోహైడ్రేట్స్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.  ఇవి మీ శరీరం లో ఇన్సులిన్ ను రిలీజ్ చేసి ట్రిప్టోఫాన్ ని మెదడు లోకి వెళ్ళేలాగా చేస్తుంది. దీని వల్ల మీకు మంచి నిద్ర పడుతుంది.
  7. ఆకు కూరలు: ఆకు కూరలలో మెగ్నీషియం మరియు కాల్షియమ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తినడం వలన మీ స్లీప్ సైకిల్ సెట్ అయ్యి మీకు మంచి నిద్ర అందుతుంది.
  8. బాదాం పప్పులు: బాదం పప్పులలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. మెగ్నీషియం కండరాలను రిలాక్స్ చేస్తుంది మరియు నిద్రను మెరుగు పరుస్తుంది. మెగ్నీషియం నిద్ర హార్మోన్ మెలటోనిన్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా నిద్రలేమి ఉన్న వారికి ఇవి బాగా సహాయపడతాయి. . సాయంత్రం స్నాక్‌గా కొన్ని బాదంపప్పులు తీసుకోవడం వలన ఆరోగ్యకరమైన నిద్రను పొందవచ్చు.

వీటితో పాటు కామోమైల్ టీ, ఫ్యాటీ ఫిష్,  పాల పదార్థాలు తీసుకోవడం వల్ల మీకు మంచి  నిద్ర పడుతుంది.

నిద్రకు ముందు తినకూడనివి ఏంటి?

ఇప్పడి వరకు మనం నిద్ర బాగా పట్టాలంటే ఎం ఆహారం తీసుకోవాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం ఆహారం తీసుకోకూడదో తెలుసుకుందాం.

  1. టీ/కాఫీ: టీ, కాఫీ వంటి కెఫనేటెడ్ పదార్థాలను నిద్ర ముందు తీసుకోవడం మానేయండి. ఇవి మీ నిద్రకు భంగం కలిగిస్తాయి.
  2. కార్బోనేటేడ్ డ్రింక్స్: నిద్రకు ముందు కూల్డ్రింక్స్, సోడా వంటి కార్బోనేటేడ్ డ్రింక్స్ ను తీసుకోవడం మానేయండి. ఇవి తీసుకోవడం వలన మీకు కడుపు ఉబ్బరంగా ఉంటుంది. మరియు నిద్ర పోవడానికి ఇబ్బందిగా ఉంటుంది.
  3. ఆల్కహాల్: నిద్రకు ముందు మద్యం సేవించడం తగ్గించండి. మద్యం సేవించినప్పుడు మీకు నిద్ర వస్తుంది కానీ దీర్ఘ కాలంలో మీకు మంచి నిద్ర దొరకదు. అలాగే మీరు మద్యానికి వ్యసనం అవుతారు.
  4. స్పైసీ మరియు భారీ భోజనం: నిద్రకు ముందు స్పైసీ మరియు భారీగా ఆహరం తీసుకోకండి. ఇవి తీసుకోవడం వలన మీకు అసిడిటీ వస్తుంది. దీనివల్ల మీరు నిద్ర పోలేరు.
  5. ప్రోటీన్ ఫుడ్స్: ప్రోటీన్ మన శరీరానికి చాలా అవసరం, కానీ ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. నిద్రకు ముందు ఇవి తీసుకోవడం వలన అరగడం ఇబ్బంది అయ్యి మీకు నిద్ర పట్టదు.

వీటితో పాటు ఎక్కువ చెక్కర కలిగి ఉన్న ఆహారం, సిట్రస్ ఫ్రూట్స్ మరియు టొమాటోలు తీసుకోవడం మానేయండి. ఇలా చేయడం వలన మీకు మంచి నిద్త్ర పడుతుంది.

మైక్రోఫైబర్ పిల్లో

ఈ నిద్రను ప్రోత్సహించే ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకోవడంతో పాటు, మీ నిద్ర వాతావరణం సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవడం ప్రశాంతమైన నిద్రను సాధించడానికి కీలకం. మీ నిద్ర వాతావరణాన్ని మెరుగుపరచడానికి  మైక్రోఫైబర్ దిండును ఉపయోగించడం ఒక మార్గం. స్లీప్సియా వారి మైక్రో ఫైబర్ పిల్లో మీరు మంచి నిద్ర పొందడానికి చాలా ఉపయోగపడుతుంది.

మైక్రో ఫైబర్ పిల్లో యొక్క ప్రయోజనాలు

  1. సౌకర్యం మరియు మద్దతు: మైక్రోఫైబర్ దిండ్లు తల మరియు మెడకు అద్భుతమైన మద్దతును అందిస్తాయి, వెన్నెముక యొక్క సరైన అమరికను నిర్వహించడానికి సహాయపడతాయి. ఈ మద్దతు మెడ మరియు వెన్నునొప్పిని తగ్గిస్తుంది, ఇది మరింత సౌకర్యవంతమైన మరియు అంతరాయం లేని నిద్రకు దారితీస్తుంది. స్లీప్సియా మైక్రో ఫైబర్ పిల్లోస్ మీకు మంచి మద్దతు మరియు సౌకర్యాన్ని అందిస్తాయి.
  2. ఉష్ణోగ్రత నియంత్రణ: మైక్రోఫైబర్ దిండ్లు శ్వాసక్రియకు వీలుగా రూపొందించబడ్డాయి మరియు ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి, స్లీప్సియా మైక్రో ఫైబర్ పిల్లోస్ రాత్రంతా మిమ్మల్ని చల్లగా మరియు సౌకర్యవంతంగా ఉంచుతాయి. వేడెక్కడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది, కాబట్టి సరైన ఉష్ణోగ్రతను నిర్వహించడానికి సహాయపడే దిండు ప్రయోజనకరంగా ఉంటుంది.
  3. దీర్ఘకాల ఉపయోగం: అధిక-నాణ్యత మైక్రోఫైబర్ దిండ్లు మన్నికైనవి మరియు చాలా కాలం పాటు వాటి ఆకృతిని మరియు మద్దతుని కలిగి ఉంటాయి. ఈ దీర్ఘాయువు అంటే మీరు రాత్రికి రాత్రి సౌకర్యవంతమైన దిండు యొక్క ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు. స్లీప్సియా మైక్రోఫైబర్ పిల్లోస్ దీర్ఘకాలం లో మీకు బాగా పని చేస్తాయి.

ముగింపు

మంచి నిద్ర కోసం ఆహారాన్ని దృష్టిలో ఉంచుకుంటూ ఇంకా చాలా చేయాలి. మంచి ఆహారం, రాత్రి పూట తొందరగా తినడం, లైట్ గా తినడం, ఎక్కువ నీరు త్రాగడం, ఒక మంచి బెడ్ టైం రొటీన్ ను తయారు చేసుకోవడం, వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. వీటన్నిటితో పాటు స్లీప్సియా మైక్రో ఫైబర్ పిల్లో వాడడం వలన మీకు భంగం లేని నిద్ర అందుతుంది.  మంచి నిద్ర ఉండడం వలన మంచి ఆరోగ్యం పొందుతారు.